సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమరావతి రాజధానిలో 83,424 ఎకరాలకు చేరుకున్న భూ సమీకరణ

1 గంట క్రితం

amaravati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రైల్వేలైన్‌, ఐఆర్‌ఆర్‌ కోసం కొప్పురావూరు, పెదకాకానిలో భూ సేకరణ

- కంతేరు, తాడికొండలో సమీకరణ

- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాజధాని అమరావతి ఇన్నర్‌ ‌రింగురోడ్డు, ఎర్రుపాలెం, నంబూరు బ్రాడ్‌‌గేజ్‌ రైల్వేలైను నిర్మాణం కోసం ప్రభుత్వం 6212 ఎకరాల భూమిని సమీకరించనుంది. దీంతోపాటు పెదకాకాని మండల పరిధిలోని పెదకాకాని, కొప్పురావురులో రైల్వేలైన్‌ ‌కోసం రెండువైపులా 50 మీటర్ల వెడల్పులతో మొత్తం 100 మీటర్ల బఫర్‌‌తో భూసేకరణ చేయనున్నారు. దీనిపై సోమవారం పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. సిఆర్‌‌డిఏ అథారిటీ తీర్మానం 713/2026లో పేర్కొన్న విధంగా రైతుల విజ్ఞప్తి మేరకు గ్రిడ్‌ ‌రోడ్ల విస్తరణ కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటి వరకూ రాజధాని అమరావతి విస్తీర్ణం మొదటిదశలో 54,374 ఎకరాలు, రెండోదశలో 20,494 ఎకరాలు, మూడోదశలో మోతడకలో 2,344 ఎకరాలు, తాడికొండ, కంతేరులో కలిపి 6,212 ఎకరాలు మొత్తంగా సుమారు 83,424 ఎకరాలకు చేరుకుంది. సోమవారం ఇచ్చిన జిఓ 216 ప్రకారం గుంటూరు జిల్లా కంతేరులో 974.00 ఎకరాలు, తాడికొండ గ్రామంలో 5,238.50 ఎకరాలు సమీకరణ పద్ధతిలో తీసుకోనున్నట్లు తెలిపారు. ఆలాగే ఆ రెండు గ్రామాల్లో పూలింగు కింద భూములు ఇవ్వని వారితోపాటు కొప్పురావూరు పెదకాకాని గ్రామాల్లో రైల్వే లైన్ అలైన్‌మెంట్ పరిధిలో ఇరువైపులా 50 మీటర్ల వెడల్పుతో మొత్తం 100 మీటర్ల బఫర్‌తో భూసేకరణను ప్రారంభించేందుకు సిఆర్‌‌డిఏ కమిషనర్‌‌కు అధికారం కల్పించారు. పట్టా, వక్ప్‌, ఎండోమెంటు భూములు కలిపి కంతేరు రెవెన్యూలో 3299.26 ఎకరాలు, తాడికొండలో 11,216.12 ఎకరాలు మొత్తం 14,515.38 ఎకరాలు ఉంది. కంతేరులో ప్రభుత్వ భూమి 304 ఎకరాలు, తాడికొండలో 1445 ఎకరాలు మొత్తం 1750 ఎకరాలు ఉంది. వీటిల్లో కంతేరులో రైల్వేలైన్‌ ‌కోసం 148.30 ఎకరాలు, ఇన్నర్‌ ‌రింగురోడ్డు కోసం 58 ఎకరాలు, గ్రిడ్‌ ‌రోడ్ల కోసం 35.65 ఎకరాలు మొత్తం 241.98 ఎకరాలు వినియోగించనున్నారు. ఈ గ్రామంలో ఎల్‌‌పిఎస్‌ ‌కింద 947 ఎకరాలు తీసుకోనున్నారు. తాడికొండ రెవెన్యూ పరిధిలో రైల్వేలైను కోసం 701.26 ఎకరాలు, ఐఆర్‌ఆర్‌ ‌కోసం 167.79 ఎకరాలు, గ్రిడ్‌ ‌రోడ్ల కోసం 470.31 ఎకరాలు మొత్తంగా 1338.34 ఎకరాలు వినియోగించనున్నారు. తాడికొండలో మొత్తంగా 5238.50 ఎకరాలు సమీకరణ పద్ధతిలో తీసుకోనున్నారు. సమీకరణ చేసేందుకు సిఆర్ డిఏ కమిషనర్‌‌కు అధికారం ఇచ్చారు. ఆయా గ్రామాల్లో సమీకరణకు ఇవ్వనివారి నుండి సేకరణ పద్ధతిలో భూములు తీసుకునేందుకు కమిషనర్‌‌కు అధికారం కల్పించారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలాక్ర్టనిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ సంస్థకు నిడమ్రరులో 19 ఎకరాల భూమి కేటాయిస్తూ మరో జిఓ ఇచ్చారు. దీనిలో రూ.730 కోట్ల పెట్టుబడి పెడతారని పేర్కొన్నారు. అమరావతి సంగమం, సెంట్రల్‌ ‌లైబ్రరీ నిర్మాణానికి రూ.759 కోట్లకు పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్