ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నరసరావుపేటలో పిడుగుల బీభత్సం.. ఇద్దరి మృతి

23 నిమిషాల క్రితం

auto .jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 10:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పల్నాడు: పల్నాడు, బాపట్ల జిల్లాల్లో శనివారం రాత్రి భారీ వర్షంతో పాటు పిడుగులు పడటంతో ఇద్దరు మృతి చెందారు. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామానికి చెందిన నాగమ్మ, బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన వెంకాయమ్మ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. భారీ వర్షం సమయంలో పిడుగుల శబ్దాలకు భయాందోళనకు గురై వీరు మృతి చెందినట్లు సమాచారం.

పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులు పడటంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పెట్లూరివారిపాలెంలో వేపచెట్టుపై పిడుగు పడటంతో సమీపంలోని రెండు ఆటోలు దెబ్బతిన్నాయి. మరోచోట కొబ్బరిచెట్టుపై పిడుగు పడటంతో అది నేలకొరిగి సమీపంలోని వస్తువులు, వాహనాలు దెబ్బతిన్నాయి. వరుసగా పిడుగులు పడటంతో ఆయా గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్