ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జావా సముద్రంలో 240 మంది ప్రయాణికులతో నౌక గల్లంతు..!

28 నిమిషాల క్రితం

ship.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 10:09 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇండోనేషియాలో 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక జావా సముద్రంలో గల్లంతైంది. ‘విర్గో ట్రాన్స్‌పోర్ట్ 8’ నౌక తూర్పు జావా నుంచి దక్షిణ కాలిమంతన్‌లోని బంజర్‌మాసిన్‌కు వెళ్తుండగా సంబంధాలు తెగిపోయాయి.సురబయ–బంజర్‌మాసిన్ మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో నౌకతో సమాచార సంబంధాలు తెగిపోయినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నౌక ఆచూకీ చివరిసారిగా బంజర్‌మాసిన్‌కు సుమారు 148 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. నౌక నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే సహాయక బృందాలను రంగంలోకి దించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. నౌకలో ఉన్న ప్రయాణికుల పరిస్థితిపై ప్రస్తుతం స్పష్టత రావాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్