mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆటోను ఢీకొట్టిన లారీ - ముగ్గురు మృతి

2 గంటల క్రితం

road acciden
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 01:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శావల్యాపురం (ప్రకాశం) : ఆటోను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన సోమవారం ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి సమీపంలో జరిగింది. శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన 10 మంది నాదెండ్ల మండలం సంకురాత్రిపాడులో జరిగే దశదిన కర్మకు హాజరయ్యేందుకు ఆటోలో బయలుదేరారు. కామేపల్లి రైల్వే అండర్‌పాస్‌ సమీపానికి వచ్చేసరికి గ్రానైట్‌తో వస్తున్న లారీ మలుపుతిరుగుతూ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుకొండలు (60), రమణమ్మ (50) అక్కడిక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ఏడుగురిని సమీపంలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సుబ్బాయమ్మ (70) ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్