ఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరోసారి ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు ఏకంగా 102 డాలర్ల మార్కుకు చేరువైంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేకపోవడంతో ఆయిల్ కంపెనీల మార్జిన్లు భారీగా తగ్గుతున్నాయి. చమురు ఉత్పత్తి ఎక్కువగా ఉండే కీలక ప్రాంతాల్లో ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చడంతో, ముడి చమురు వెలికితీత మరియు ఎగుమతులకు తీవ్ర విఘాతం కలుగుతుందన్న ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో పెరిగిపోయాయి. ఈ అనిశ్చితి కారణంతో అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లు జోరందుకుని ధరలు భారీగా పెరగడానికి దారితీసింది.
ప్రస్తుతం చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై సుమారు రూ.5, డీజిల్‌పై రూ.23 వరకు నష్టపోతున్నట్లు రేటింగ్ సంస్థ ఐసీఆర్‌ఏ అంచనా వేసింది. క్రూడాయిల్ ధరలు మరింతకాలం ఇదే స్థాయిలో కొనసాగితే కంపెనీల ఆర్థిక పరిస్థితిపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. క్రూడాయిల్ ధరల పెరుగుదలతో భారత్ దిగుమతి బిల్లు కూడా పెరుగుతోంది. అంతర్జాతీయ చమురు ధరలు అధికంగా కొనసాగితే భవిష్యత్తులో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.







కామెంట్‌లు (0)