ప్రజాశక్తి-తాడేపల్లి:గుంటూరుజిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఒక పంచర్ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇవి వేగంగా వ్యాపించి పక్కనే ఉన్న బిల్డింగ్ మెటీరియల్ షాపుకు కూడా అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో మెటీరియల్ షాపులోని నిచ్చెనలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.ఘటనా స్థలానికి అత్యంత సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే మంటలు బంక్ వైపు వ్యాపించకపోవడంతో పెను ముప్పు తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే మంగళగిరి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తెచ్చారు.
ఉండవల్లి సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 05, 2026, 09:31 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)