ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మత్స్యకారుల గల్లంతుపై సీఎం చంద్రబాబు సమీక్ష

1 గంట క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 10:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • గాలింపు ముమ్మరం చేయాలని ఆదేశం

ప్రజాశక్తి-కుప్పం/విశాఖపట్నం: ఈ నెల 1వ తేదీన విశాఖ నుంచి బోటులో వేటకు వెళ్లిన భోగాపురం, భీమిలి ప్రాంతాలకు చెందిన ఏడుగురు మత్స్యకారుల ఫోన్లు స్విచ్ ఆఫ్‌ కావడంతో గల్లంతైన సంగతి తెలిసిందే. మత్స్యకారులు గల్లంతైన వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన ఈ ఘటనపై ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడారు. మత్స్యకారులను సురక్షితంగా రక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న అత్యవసర చర్యలను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. కోస్ట్‌గార్డ్ నౌకలతో సముద్రంలో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం భారత నౌకాదళం (నేవీ) హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్‌ను విస్తృతం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. సముద్రంలో జరుగుతున్న ఈ గాలింపు చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ, మెరైన్ ఐజీపీ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ (సీపీ) లతో పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్