సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆక్వా వ్యర్థాల అనర్థాల నివారణకు చర్యలు

1 గంట క్రితం

pavan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 09:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఉప ముఖ్యమంత్రి పవన్‌‌కల్యాణ్

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆక్వా వ్యర్థాల కారణంగా ఉత్పన్నమయ్యే అనర్థాల నుంచి జలవనరులను పరిరక్షించేలా నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్‌‌కల్యాణ్‌ ఆదేశించారు. ఆక్వా ప్రాసెసింగ్‌, ప్రీ ప్రాసెసింగ్‌ ‌యూనిట్ల నుంచి వెలువడుతున్న కాలుష్య ప్రభావం, నివారణ చర్యలపై సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ‌కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు పవన్‌ ‌దిశానిర్దేశం చేశారు. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు నిర్దేశిత పర్యావరణ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. శుద్ధి చేయని ఆక్వా వ్యర్థాల్లో పరిమితికి మించి హానికారక రసాయనాలు ఉండడం వల్ల నదులు, కాలువలు, సాగర సంగమ ప్రాంతాలతోపాటు భూగర్భ జలాలు కూడా కాలుష్య బారినపడి ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బ తీస్తుందన్నారు. పర్యావరణ ప్రమాణాలు పాటించని 10 యూనిట్లకు ఇప్పటికే షోకాజ్‌ ‌నోటీసులు జారీ చేశామని పవన్‌‌కు అధికారులు వివరించారు.

​ఏనుగుల సంచారంపై అప్రమత్తం

చిత్తూరు జిల్లా, పడిపుట్లబైలు సమీపంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్‌ ఆదేశించారు. ఏనుగుల సంచారంపై సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముసలమడుగు శిబిరం నుంచి కుంకీ ఏనుగులను తీసుకొచ్చి ఆపరేషన్ చేపట్టాలన్నారు. వివిధ శాఖల సమన్వయంతో ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వడంతోపాటు పరిసర గ్రామాల్లో మానవ–ఏనుగు ఘర్షణలు తలెత్తకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలూ చేపట్టాలన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్