సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యుదాఘాతంతో మహిళా రైతు దుర్మరణం

1 గంట క్రితం

విద్యుదాఘాతంతో మహిళా రైతు దుర్మరణం
- విద్యుత్‌శాఖ నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తుల ఆగ్రహం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 09:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • విద్యుత్‌శాఖ నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తుల ఆగ్రహం

ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్ : పార్వతీపురం మండలంలోని సంగంవలస పంచాయతీ నడిమి గదపవలస సమీపాన విద్యుదాఘాతంతో బడే జానకమ్మ (50) అనే మహిళా రైతు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం... సంగం వలస గ్రామానికి చెందిన జానకమ్మ సోమవారం సాయంత్రం తమ పొలానికి పనుల నిమిత్తం వెళ్తున్నారు. తుపాను కారణంగా ఇటీవల పొలంలో ఉన్న విద్యుత్ స్తంభం వంగిపోయి, తీగలు చాలా కిందకు వేలాడుతున్నాయి. ఇది గమనించకుండా పొలం గట్టుపై నడుచుకుంటూ వెళ్తున్న జానకమ్మ ముఖానికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తల్లి హఠాన్మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న స్థానికులు, రైతులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ శాఖ అధికారుల అలసత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్