సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపిపిపి విధానంలో క్యాథ్‌‌ల్యాబ్‌‌లు..

1 గంట క్రితం

satyakumar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 09:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో గుండె సంబంధిత వైద్య సేవలను మరింత విస్తరించి, పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో కొత్త క్యాథ్‌ల్యాబ్‌ల ఏర్పాటుకు టెండర్‌ ప్రక్రియ కొనసాగుతోందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీటి కోసం రూ.18 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 8 క్యాథ్‌ల్యాబ్‌లు పనిచేస్తున్నాయన్నారు. వీటిలో 5 ప్రభుత్వ ఆధ్వర్యంలో, 3 ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య విధానంలో పనిచేస్తున్నాయని వివరించారు. కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో ఇప్పటికే ఉన్న క్యాథ్‌ల్యాబ్‌ను ఆధునీకికరించామన్నారు. అలాగే ప్రధాన ఆస్పత్రుల్లో గుండె వైద్య పరికరాలు, మౌలిక వసతుల కల్పనకు రూ.34 కోట్లతో ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. తిరుపతి, కడప, అనంతపురం, గుంటూరు ప్రభుత్వాస్పత్రులకు మరో 4 హార్ట్‌–లంగ్‌ మెషిన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతపురంలో త్వరలో ఓపెన్‌ హార్ట్‌ శస్త్రచికిత్సలు ప్రారంభించనున్నామని వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్