శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వెండి పతక విజేత దాక్షిణ్యను అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి

3 గంటల క్రితం

award
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 07:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గోవాలో జరిగిన 8వ బ్రాండీ ఫెడరేషన్ కప్ స్కేటింగ్ పోటీల్లో వెండి పతకం సాధించిన సిహెచ్‌వి దాక్ష‍ిణ్యను క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు. రాష్ట్రానికి వెండి పతకం సాధించిన విజయవాడకు చెందిన దాక్షిణ్య అమరావతి సచివాలయంలో శుక్రవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. బిగ్ చాంపియన్స్ స్కేటింగ్ అకాడమీ కోచ్ షేక్ ఖాదర్ బాషా మాట్లాడుతూ.. దాక్షిణ్య అతి చిన్న వయసులోనే స్కేటింగ్‌లో 35 కిలోమీటర్ల మేర ప్రదర్శన చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడంతో పాటు రెండు జాతీయ అవార్డులు అందుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్