శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ధాన్యం కొనుగోళ్లలో లోపాలను సరిదిద్దాలి

1 గంట క్రితం

rythu sangham
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 10:18 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎపి రైతు సంఘం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రక్రియలో లోపాలను సరిదిద్దాలని ఆంధ్రప్రదేశ్‌ ‌రైతు సంఘం డిమాండ్‌ ‌చేసింది. పౌరసరఫరా శాఖ విజయవాడలో నిర్వహించిన ద్వైవార్షిక సమావేశంలో ఈ సమస్యలు, లోపాలను సంఘం నాయకులు వై.కేశవరావు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు, తదితరులు మంత్రి, అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. రైతు సేవా కేంద్రాల్లో నిర్దేశించిన తేమశాతాన్ని మిల్లర్లు అంగీకరించకుండా 5 నుంచి 8 శాతం వరకు ఎక్కువగా చూపిస్తున్నారని, దీని వల్ల ప్రతి రైతు, క్విటాలకు 5 నుంచి 8 కిలోల ధాన్యం కోల్పోతున్నారని చెప్పారు. ధాన్యం రవాణా సమయములో మిల్లర్లు, వారి ఏజెంట్లు, లారీలను దిగుమతి చేసుకుంటూ రైతులు స్వయంగా తెచ్చిన ట్రాక్టర్లు, లారీలను ఒక రోజంతా అన్‌లోడ్‌ ‌చేయకుండా నిలివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. అనేకమంది రైతులు మూడు టిక్కీలు వేస్తే 100 నుంచి 110 కిలోలు మాత్రమే చూపించిన సందర్భాలు ఉన్నాయన్నారు. రూ.50 కోట్ల విలువైన టర్బలిన్‌‌లు ఇచ్చినప్పటికీ.. అవి కౌలు రైతులకు కానీ హెక్టర్ లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులకు అందిన దాఖలాలు లేవని వెల్లడించారు. ఖరీఫ్ సీజన్లో కురిసిన తుఫాన్ వర్షాలకు హార్వెస్టర్లు పెద్ద రైతులకు మాత్రమే వెళ్లారు. చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు 3500 ఉన్న కిరాయి 5వేలకు పైగా చెల్లించవలసి వచ్చిందన్నారు. హార్వెస్టర్లు, డైయర్స్ రైతు సేవ కేంద్రంలో పెట్టి సన్న, చిన్న కారు కౌలు రైతులకు సరఫరా చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. విజయనగరం రైతులకు వెల్లించవలసిన సంచులు, కూలీ, రవాణా చార్జీలు చెల్లించవలసిన బకాయిలు 12 కోట్లు వెంటనే చెల్లించాలని కోరారు. నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో 17,500 అమ్మవలసిన పుట్టి ధాన్యం 14 నుండి 15 వేల మధ్య అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పారు. కౌలు రైతులకు చట్టం చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం చట్టం చేయక పోవటంతో కౌలు రైతులు తమ ధాన్యం అమ్ముకోవటానికి ఇక్కట్ల పాలు అవుతున్నారని తెలిపారు. ఈ ఏడాదైనా జౌలు రైతులు అందరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. గ్రామాలలో ధాన్యం అరబెట్టుకోవడానికి ప్లాట్ ఫారాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో రైతు నాయకులు కె. శ్రీనివాసరావు, పివి ఆంజనేయులు, బంటు దాసు, జయంతి బాబు, సివి కోటిరెడ్డి తదితర నాయకులు మాట్లాడారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్