మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కడపలో కోవిడ్ కేసులపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల

10 జులై, 2026

sharmila
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 10:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి బ్యూరో : కడప జిల్లాలో కోవిడ్ లక్షణాలతో నమోదవుతున్న కేసులతో పాటు పాజిటివ్ నిర్ధారణ కావడం, ఈ లక్షణాలతో మరణాలు సంభవించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని ఎపిసిపి చీఫ్‌ ‌వై.ఎస్‌ ‌షర్మిల పేర్కొన్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితి తీవ్రత, ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధతపై వివరాలు తెలుసుకున్నట్లు ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి, కోవిడ్ లక్షణాలున్న వారిని గుర్తించి వెంటనే పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రజలు, కాంగ్రెస్ జిల్లా నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కోవిడ్ మళ్లీ వ్యాప్తి చెందకుండా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్