ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ అధికారిక పర్యటన నిమిత్తం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్ వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం.. మంత్రి పి. నారాయణ ఆగస్టు 10 నుంచి 14 వరకు లండన్‌లో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. అయితే ఈ పర్యటనకు ముందు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన అనుమతులు, రాజకీయ అనుమతి తప్పనిసరిగా పొందాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ అధికారిక విదేశీ పర్యటనకు సంబంధించిన వ్యయాన్ని ఎపిసిఆర్‌డిఎ, ఎజిఐసిఎల్ ప్రాజెక్టుల కోసం మంజూరైన నిధుల నుంచి భరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మంత్రి పర్యటనకు సంబంధించిన తదుపరి చర్యలు చేపట్టాలని పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖను ఆదేశించింది.
మంత్రి పి. నారాయణ లండన్ పర్యటనకు అనుమతి
07 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 07, 2026, 09:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)