నామినేషన్ కోసం న్యాయపోరాటం చేస్తామని వెల్లడి
ప్రజాశక్తి–తిరుపతి: పుంగనూరు మున్సిపాలిటీలో చోటుచేసుకున్న ఘటనలపై ఎంపీ మిథున్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియకు సంబంధించి న్యాయపోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. మిథున్రెడ్డి, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. పుంగనూరుకు రావొద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పుంగనూరు ఘటనలు, నామినేషన్ ప్రక్రియపై రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.







కామెంట్లు (0)