ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆలమూరు మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు సర్వసిద్ధం

1 గంట క్రితం

All set for MPTC elections in Alamuru mandal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 12:28 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఈ నెల 21న నామినేషన్లతో మొదలై నవంబర్ 5న అభ్యర్ధుల గెలుపుతో ముగింపు.

18 పంచాయతీలు - 21 ఎంపీటీసీలు.

60,009 ఓటర్లు - 77 పోలింగ్ బూత్లు.

అత్యధికం జొన్నాడ- 4,963, అత్యల్పం గుమ్మిలేరు - 1,814.


ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండల ప్రజా పరిషత్ ఎన్నికలకు సంబంధించి అధికారులు సర్వసిద్ధం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఎంపీటీసీ /జడ్పిటిసి షెడ్యూల్ వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ఈ నెల 21 నుండి 23 వరకు ఆయా మండలాల మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24వ తేదిన నామినేషన్ల పరిశీలన (స్కూటీని ఆఫ్ నామినేషన్స్) చేస్తారు. 25వ తేదీన నామినేషన్ ఫారం లో ఏమైనా తప్పిదాలు జరిగి తిరస్కరించిన నామినేషన్లపై అప్పిలు చేసుకునేందుకు అవకాశం. 26వ తేది ఎన్నికల అధికారి తిరస్కరణ నామినేషన్ల పై తుది నిర్ణయం జరుగుతుంది. 27వ తేది నామినేషన్ల ఉపసంహరణకు అవకాశము కల్పించారు. 27వ తేది సాయంత్రం ఎన్నికల అధికారి చే ఎంపీటీసీ /జడ్పిటిసి పదవులకు పోటీ చేయు తుది అభ్యర్థుల పేర్లను నోటీస్ బోర్డులో ప్రకటన చేస్తారు. నవంబర్ 3వ తేదిన ఓటర్ల ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థులకు పోలింగ్ నిర్వహించెదరు. 4వ తేదిన అవసరమైన చోట ఎన్నికల అధికారి అనుమతితో రీపోలింగ్ నిర్వహిస్తారు. చివరగా 5వ తేది ఎంపీటీసీ/జెడ్పిటిసి సభ్యులకు పోలైన ఓట్ల లెక్కింపు, ఆ వెంటనే ఫలితాల ప్రకటన, గెలిచిన అభ్యర్థులకు ఎన్నికల అధికారిచే ధృవీకరణ పత్రం అందజేస్తారు. అయితే ఆలమూరు మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉండగా 21 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అలాగే 60,009 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎస్సీ 7,760, ఎస్టి 1,613, బిసి 19,828, ఓసి 30,808 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఓట్లు వేయడానికి 77 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. మడికి-1 నుంచి ఈ ఎంపిటిసి స్థానాలు ప్రారంభమై చింతలూరు/సూర్యారావుపేటతో ముగుస్తాయి. ఇక మండలంలో అత్యధిక ఓట్లు ఎంపిటీసి స్థానం జొన్నాడ 4,963 కాగా అతి తక్కువ ఓట్లు గుమ్మిలేరు 1,814 గా ఉన్నాయి. ఇక ఏఏ ఎంపిటిసిలకు ఎన్ని ఓట్లు ఉన్నాయో పరిశీలిస్తే.. మడికి-1 కు 3,416 ఓట్లు మడికి-2 కు 3,423, బడుగువానిలంక 2,575, చొప్పెల్ల-1కు 2,000, చొప్పెల్ల-2కు 2,000, చొప్పెల్ల/నవాబుపేట- 2,724, చెముడులంక- 3,550, నర్సిపూడి-3,596, జొన్నాడ 4,963, మూలస్థానం-1కు 2,905, మూలస్థానం-2కు 2,905, ఆలమూరు-1కు 2,840, ఆలమూరు-2కు 2,840, ఆలమూరు -3కు 2,281, పెనికేరు/కలవచర్ల 4,073, మోదుకూరు 1,853, గుమ్మిలేరు 1814, పెదపల్ల 2,471, పినపళ్ల 2,415, సంధిపూడి 1,960, చింతలూరు/ సూర్యారావుపేట 3,405 ఓట్లుగా ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అధికారులు అప్రమత్తమై తగు జాగ్రత్తలు తీసుకున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్