ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి నామినేషన్‌

1 గంట క్రితం

giddaluri.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 12:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 21వ వార్డులో అభ్యర్థిగా దద్దనాల శ్రీనివాసులు నామినేషన్

ప్రజాశక్తి-గిద్దలూరు: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల రణరంగం వేడెక్కుతోంది. నామినేషన్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో సిపిఎం కూడా ఎన్నికల బరిలోకి దిగింది. గిద్దలూరు పట్టణంలోని 21వ వార్డు నుంచి సిపిఎం అభ్యర్థిగా దద్దనాల శ్రీనివాసులు ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. గిద్దలూరులో తొలిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దిగుతున్న సిపిఎం ప్రవేశంతో స్థానిక రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే టిడిపి, వైసిపి, బిజెపి అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా, తాజాగా సిపిఎం కూడా పోటీకి సిద్ధమైంది. దీంతో 21వ వార్డులో ఎన్నికల పోరు మరింత ఉత్కంఠభరితంగా మారనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్