మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅక్షరాంధ్రలో ఎమ్మెల్యేలు

1 గంట క్రితం

Minister Lokesh spoke with Indian Embassy officials regarding the boat accident.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 11:08 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అక్షరాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యేలను, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేసి పెద్దఎత్తున ప్రజలను చైతన్యవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఆ శాఖ అధికారులకు సూచించారు. గతేడాది చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్పలితాలనిస్తోందని, ఉద్యమంలా పనిచేసి వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనకు అధికారులంతా కలసికట్టుగా కృషిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2024నాటికి రాష్ట్రంలో అక్షరాస్యత శాతం దేశంలోనే అట్టడుగున కేవలం 72.6శాతం ఉంందని, కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా 25లక్షలమంది అక్షరాస్యులుగా మారారని తెలిపారు. కేంద్రం విడుదల చేసిన వయోజన విద్య పరీక్షా ఫలితాల్లో 10శాతం పెరిగి 82.1శాతానికి చేరుకుందని, 2027 సెప్టెంబర్ నాటికి నూరుశాతం అక్షరాస్యత సాధన దిశగా పనిచేయాలని కోరారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి నూరుశాతం అపార్ ఐడి ఇంటిగ్రేషన్ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బడిఈడు పిల్లలందరినీ ట్రాక్ చేసి పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికీ బడిబయట ఉన్న 1,64,821 మంది పిల్లలను పూర్తిస్థాయిలో పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవచూపాలని చెప్పారు. విద్యార్ధుల హాజరు శాతం 85.41శాతంగా ఉందని, దీనిని పెంచేందుకు కృషి చేయాలని కోరారు. విద్యార్థి వరుసగా 3రోజులపాటు వరుసగా పాఠశాలకు గైర్హాజరైతే తల్లిదండ్రులను పిలిపించి ఎడ్యుకేట్ చేయాలని అన్నారు. స్కూలు మేనేజ్ మెంట్ కమిటీలకు ఈ విషయంలో కూడా బాధ్యతలు అప్పగించాలన్నారు. ఈనెల 5వతేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో 192మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్య డైరక్టర్ తమీమ్‌ అన్సారియా చెప్పారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా, సమగ్రశిక్ష డైరక్టర్ బి శ్రీనివాసరావు, పాఠశాల విద్య మౌలిక సదుపాయాల సంస్థ ఎండి దీవెన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్