సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు

1 గంట క్రితం

kurnool to machilipatnam.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 07:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఢిల్లీ: మచిలీపట్నం- కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసుకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. ఈ రైలు మచిలీపట్నం నుంచి కర్నూలుకు సోమ, బుధ, శనివారాల్లో ఈ రైలు నడవనుంది. మచిలీపట్నంలో సాయంత్రం 4:55 గంటలకు బయలుదేరి, రాత్రంతా ప్రయాణించి మరుసటి రోజు ఉదయం 5:45 గంటలకు కర్నూలు సిటీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, కర్నూలు సిటీ నుంచి మంగళ, గురు, ఆదివారాల్లో ఉదయం 9:30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 9:35 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. ఈ సమయాలు రాత్రి ప్రయాణికులకు, అలాగే పగటిపూట ప్రయాణించాలనుకునే వారికి అనుకూలంగా ఉన్నాయి. ఈ రైలు సర్వీసుకు గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, బేతంచెర్ల, డోన్ స్టేషన్లలో వాణిజ్యపరమైన హాల్టులను కేటాయించారు.  ఈ కొత్త రైలుతో కోస్తా జిల్లాల నుంచి పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాలకు ప్రత్యక్ష రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్