అమరవీరుడు భగత్‌సింగ్ జయంతిని పురస్కరించుకుని ఎస్ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పాడేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సోమవారం వేడుకలు నిర్వహించారు. యూత్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో కళాశాల నుంచి ఐటిడిఎ గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ముందుగా కళాశాలల్లో భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు చిట్టిబాబు, లక్కు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్ శ్రీను మాట్లాడుతూ.. భగత్‌సింగ్ 23 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన యువకిశోరమన్నారు. ఆయన పోరాటం కేవలం ఆయుధాలతోనే కాకుండా రచనలు, ఆలోచనల ద్వారా కూడా సాగిందన్నారు. నేటి విద్యార్థులు భగత్‌సింగ్ స్ఫూర్తితో సమాజంలోని సమస్యలను ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్యను ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేయడంతో సామాన్య విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. చదువుతోపాటు సమాజం పట్ల బాధ్యతను పెంపొందించుకోవాలని సూచించారు. ఎస్ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జీవన్‌కృష్ణ, పాడేరు మండల బాధ్యులు చిన్నారావు, పౌలు, తదితరులు పాల్గొన్నారు.
భగత్‌సింగ్ స్ఫూర్తితో ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి: ఎస్ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్ శ్రీను
56 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 06:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)