సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలవరం నిర్వాసితుల హక్కుల కోసం మోటార్‌సైకిల్‌ యాత్ర

47 నిమిషాల క్రితం

**పోలవరం నిర్వాసితుల హక్కుల కోసం మోటార్‌సైకిల్‌ యాత్ర** image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 06:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి: వి.ఆర్.పురం,

సెప్టెంబర్ 28: పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని, పునరావాసం, పరిహారం, పోడు భూముల హక్కులను కాపాడాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో అక్టోబర్‌ 1 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్న మోటార్‌సైకిల్‌ యాత్రను విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా సోమవారం వి.ఆర్.పురం మండలంలోని సంతపాకల, రేఖపల్లి ప్రాంతాల్లో సీపీఎం బృందం షాపు షాపుకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసు కొన్నారు సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సున్నం. రాజులు, మండల కార్యదర్శి పులి సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరినీ ప్రత్యేక కుటుంబంగా గుర్తించి, 2026 కటాఫ్‌తో సంబంధం లేకుండా ప్రత్యేక ప్యాకేజీ, పరిహారం అందించాలని కోరారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రతి నిర్వాసిత కుటుంబానికి పూర్తిస్థాయి పరిహారం చెల్లించడంతో పాటు, గతంలో హామీ ఇచ్చిన రూ.10 లక్షల ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని తక్షణమే అందించాలని డిమాండ్‌ చేశారు.చింతూరు కేంద్రంగా సూపర్‌ స్పెషాలిటీ స్థాయి వైద్య సదుపాయాలు కల్పించి, ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని కోరారు. వరదలతో ప్రతి ఏటా తీవ్రంగా నష్టపోతున్న ప్రాంతాల ప్రజలకు సమగ్ర వరద సహాయం, సురక్షితమైన ఎత్తైన ప్రాంతాల్లో పునరావాస వసతులు కల్పించాలని, గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని అన్నారు. చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చింతూరు కేంద్రంగా నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.


ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు జీవో నంబర్‌ 3ను పునరుద్ధరించి చట్టబద్ధత కల్పించాలని కోరారు. వి.ఆర్.పురం మండలంలోని రేకపల్లి, తోటపల్లి, శుద్ధ గూడెం, అన్నవరం, రెడ్డి గుంపు, ఉమ్మడివరం, గుర్రంపేట, నూతిగూడెం చిన్నమట్లపల్లి సున్నం వారి గూడెం గ్రామాలను ముంపులో కలపాలి 45.75 మీటర్ల కాంటూర్‌ పరిధిలోకి పరిమితం చేయకుండా, నిర్వాసిత గ్రామాలన్నింటికీ ఒకేసారి పూర్తిస్థాయి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.


“మా మట్టి–మా నీరు–మా హక్కు” నినాదంతో చేపట్టనున్న ఈ మోటార్‌సైకిల్‌ యాత్ర అక్టోబర్‌ 1న ఉదయం 10 గంటలకు ఎటపాక మండలం కన్నాయిగూడెం నుంచి ప్రారంభమవుతుందని నాయకులు తెలిపారు. అక్టోబర్‌ 5న చింతూరు ఐటీడీఏ కార్యాలయం వద్ద మహా ప్రదర్శన, ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోలవరం నిర్వాసితుల హక్కుల సాధన కోసం నిర్వహించే ఈ యాత్రలో నిర్వాసితులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు కారం సుందరయ్య మండల నాయకులు పోడియం శ్రీరామ్మూర్తి పూనం ప్రదీప్ కుమార్ వడ్లది రమేష్ శ్రీరపు తాతబాబు గుండుపూడి లక్ష్మణరావు కమ్మచిచ్చు సత్యనారాయణ ప్రజానాట్యమండలి సిహెచ్. సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్