మంగళగిరి : చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 2వ తేదీన గుంటూరుజిల్లా గళగిరిలోని అన్నపూర్ణ థియేటర్ వద్ద గల గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ తెలిపారు. సంఘం మంగళగిరి పట్టణ కమిటీ సమావేశం ఆదివారం రాత్రి రత్నాల చెరువులోని సింహాద్రి శివారెడ్డి భవనంలో డోకుపర్తి రామారావు అధ్యక్షతన నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ చేనేత కార్మికులకు ‘నేతన్న సేవా’ పథకం రెండవ విడత కింద ఆగస్టు 30వ తేదీ నాటికి బ్యాంకుల్లో ఒక్కొక్కరికి రూ.25 వేలు జమ చేస్తామని మంత్రి సవిత చెప్పిన మాటలు అమలు కాలేదన్నారు. ఇప్పటికీ అర్హులైన చేనేత కార్మికులకు పథకం వర్తించలేదని, వృత్తిలో లేని వారికి ఎక్కువ మందికి అందినట్లుగా స్పష్టమవుతోందని చెప్పారు. తప్పుడు జాబితాలను తయారుచేసిన సత్యసాయి జిల్లాలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్లు పత్రికల్లోనూ వచ్చిందని అన్నారు. రెండో విడత డబ్బులను 30 వేల మందికి వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్ల చేనేత కార్మికులకు పింఛను పథకంలో అనేక షరతులు పెట్టి ఇబ్బందులు పెట్టడం సరికాదని, చేనేత కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు పై విచారణ జరిపి అర్హులకు పింఛను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం చేసే ధర్నాలో చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం పట్టణ కార్యదర్శి ఎస్.నరసింహారావు, జె.శివభవనారాయణ, ఎం.శివచంద్రరావు, కె.కుమారి పాల్గొన్నారు.
చేనేతల సమస్యలపై 2న ధర్నా
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 06:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)