సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మా మట్టి–మా నీరు–మా హక్కు: సిపిఎం ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుండి 5 వరకు మోటార్ సైకిల్ యాత్ర

1 గంట క్రితం

“మా మట్టి–మా నీరు–మా హక్కు”
 సిపిఎం ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుండి 5 వరకు మోటార్ సైకిల్ యాత్ర image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 06:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఎటపాక :-

పోలవరం నిర్వాసితుల సమస్య ల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి కొరకు సిపిఎం ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుండి 5 వరకు జరిగే మోటార్ సైకిల్ యాత్రను జయప్రదం చేయండి అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మోటార్ సైకిల్ యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్ను సోమవారం మురుమూరులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మర్లపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తుది దశకు చేరుకున్నప్పటికీ నిర్వాసితుల పునరవాసం మాత్రం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని అన్నారు. కాలనీలన్నీ అసంపూర్తిగా ఉన్నాయన్నారు. కాలనీలో ఉండే మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదన్నారు. ఎటపాక మండలంలో ఒక గ్రామం కూడా 41 కాంటూరు లేదని , కానీ ప్రతి ఏటా వరదలకు పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయని అన్నారు. 2022 గోదావరి వరద ముంపును ప్రామాణికంగా తీసుకొని ఆనాడు ముంపు కు గురైన గ్రామాలన్నిటికీ పునరావాసం కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో మహా పాదయాత్ర చేపట్టి ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది అన్నారు. కానీ నేటికీ మండలంలో 41కాంటూరు ముంపు గ్రామాలను ప్రభుత్వం గుర్తించలేదన్నారు. కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా ఒకే దశలో అందరికీ పునరావసం కల్పించాలని డిమాండ్ చేశారు. అందరికీ పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు ప్రారంభించాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. రైతుల భూములు తీసుకొని 15 సంవత్సరాలు గడిచాయని, కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఎప్పటికి వస్తుందో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఎటపాక మండలం ప్రజలు ఉన్నారన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు, పోడు భూముల పట్టాలు, ముంపు రైతుల సమస్యల పరిష్కారం కోసం, గ్రామాల అభివృద్ధి కోసం సిపిఎం చేపట్టే మోటార్ సైకిల్ యాత్రను జయప్రదం చేయాలని వారు కోరారు.

“మా మట్టి–మా నీరు–మా హక్కు” నినాదంతో చేపట్టనున్న ఈ మోటార్‌సైకిల్‌ యాత్ర అక్టోబర్‌ 1న ఉదయం 10 గంటలకు ఎటపాక మండలం కన్నాయిగూడెం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. అక్టోబర్‌ 5న చింతూరు ఐటీడీఏ కార్యాలయం వద్ద మహా ప్రదర్శన, ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోలవరం నిర్వాసితుల హక్కుల సాధన కోసం నిర్వహించే ఈ యాత్రలో నిర్వాసితులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమం లో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఐ వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి కాకా అర్జున్ దొర, మండల కమిటీ సభ్యులు పి. బాలకృష్ణ, సోందే రామారావు, పూనెం వెంకట్రావు, జంగిలి సంపత్, నాయకులు సోయం వీరమ్మ, పర్సిక ధర్మరాజు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్