విజయవాడ : టెర్రర్ లింక్స్ కేసు దర్యాప్తులో భాగంగా .... జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులు విజయవాడలో మరోసారి విస్తృత సోదాలు నిర్వహించారు. బుధవారం సుమారు 5 గంటల సమయం నుంచి మూడు ప్రత్యేక బృందాలుగా విడిపోయిన అధికారులు వించిపేట, భవానీపురం, మహంతీపురం ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. టౌటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వించిపేట గాంధీబొమ్మ సెంటర్లోని ఓ ఇంట్లో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఎ) తనిఖీలు కొనసాగుతున్నాయి. వించిపేట ప్రాంతంలో ఉగ్రవాద అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం వరుసగా ఇది మూడోసారి. ఈ ఏడాది మార్చి, మే నెలలో సోదాలు జరిపిన నలుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను విస్తరింపచేస్తున్నారనే సమాచారంతో ఎన్‌ఐఎ సోదాలు నిర్వహిస్తోంది. ఇటీవల అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా ? వారి నెట్‌వర్క్ ఎంత వరకు విస్తరించింది ? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. స్వాధీనం చేసుకున్న పత్రాలు, డిజిటల్ పరికరాలను విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
విజయవాడలో మరోసారి ఎన్‌ఐఎ సోదాలు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 08, 2026, 01:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)