ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మూడు రోజులపాటు జరగనున్న బాడ్మింటన్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభం అయ్యాయి. బుధవారం స్థానిక ఇండోర్ స్టేడియం లో జరుగుతున్న పోటీలను బాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు కె ఏ నాయుడు ప్రారంభించారు. కార్యదర్శి నున్నా సురేష్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షులు కె ఏ నాయుడు మాట్లాడుతూ .... మూడు రోజుకు పాటు టోర్నమెంట్ తో పాటు రాష్ట్ర పోటీలకు జిల్లా జట్లు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. మూడు రోజుల్లో జరిగే పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల్లో ప్రతిభ ఆధారంగా రాష్ట్ర పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. బాడ్మింటన్ పట్ల ఆదరణ రోజు రోజుకు పెరుగుతుంది అనడానికి వచ్చిన క్రీడాకారులు నిదర్శనమన్నారు. క్రీడా స్పూర్తితో ఆడి విజేతలుగా నిలిచి రాష్ట్ర పోటీలకు ఎంపిక కావాలని ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు డాక్టర్ వి ఎస్ ప్రసాద్, కుసుమ బచన్ అసోసియేషన్ నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా బాడ్మింటన్ పోటీలు ప్రారంభం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 08, 2026, 03:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)