ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : వేపాడ మండలం బల్లంకి గ్రామంలో మండల పశువైద్య అధికారిణి గాయత్రి ఆధ్వర్యంలో పశు గ్రాస్ వారోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ వారోత్సవాలు ఈ నెల 14వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 25 పాడిపశువులకు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరిగింది, 23 పశువులకు గర్భ కోసం వ్యాధి చికిత్సలు చేయడం జరిగింది, రెండు కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లు ఇవ్వడం జరిగింది. 20 పెయలకు నటల నివారణ మందులు ఇవ్వడం జరిగింది. 9 పశువులకి సాధారణ వైద్య సేవలు అందించడం జరిగింది. అనంతరం ఆమె పశువులు పెంపకందారులకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేపాడ పశువైద్యాలయ సిబ్బంది, పశు సంవర్ధక శాఖ సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు.
బల్లంకి గ్రామంలో పశుగ్రాస వారోత్సవాలు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 08, 2026, 03:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)