బుధవారం, 08 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్‌పి మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఈడి సోదాలు

2 గంటల క్రితం

former SP MLA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 02:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లక్నో : సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) మాజీ ఎమ్మెల్యేపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) బుధవారం దాడులు చేపట్టింది. మనీలాండరింగ్‌ కేసులో దీప్‌ నారాయణ్‌ సింగ్‌, సంబంధిత వ్యక్తులకు చెందిన పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టినట్లు ఈడి తెలిపింది. అక్రమాస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై యుపి విజిలెన్స్‌ బ్యూరో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ సహా 23 ఇతర కేసుల్లో భాగంగా దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రియల్‌ఎస్టేట్‌, నిర్మాణ కంపెనీలు, ఇతర వ్యాపారాలకు చెందిన వివిధ కంపెనీలు, ఎల్‌ఎల్‌పి నెట్‌వర్క్‌ అక్రమ లావాదేవీలు జరిపినట్లు తెలిపింది. మోసం, బెదిరింపులు, ఫోర్జరీ, దోపిడీ, హత్యాయత్నం సహా పలు కేసులు నమోదయ్యాయని, ఐపిసి, యుపిగ్యాంగ్‌స్టర్స్‌ చట్టం, గూండాల చట్టం మొదలైన వాటి కింద నమోదు చేసినట్లు ఈడి అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్