హైదరాబాద్ : ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్, తెలంగాణ పోలీసు శాఖలో నూతనంగా డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నిఖత్ జరీన్.. మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు డిఎస్పీగా అవకాశం కల్పించిన రాష్ట్రప్రభుత్వానికి, పోలీసుశాఖకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీలో నిఖత్ సాధించిన అద్భుత విజయాలపై డీజీపీ ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభతో దేశానికి, రాష్ట్రానికి ఆమె ఎనలేని గౌరవాన్ని తీసుకువచ్చారని కొనియాడారు. ఆమె విజయాలు రాష్ట్ర యువతకు, ముఖ్యంగా మహిళా క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తిదాయకమని డీజీపీ పేర్కొన్నారు.
డిజిపీని కలిసిన నిఖత్ జరీన్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 15, 2026, 09:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)