బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వీధి కుక్కల దాడి.. వ్యక్తి మృతి

2 గంటల క్రితం

naarpala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 10:59 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -నార్పల : అనంతపురం జిల్లా నార్పల మండలం గుంజేపల్లి గ్రామంలో వీధి కుక్కల దాడిలో ఒక వ్యక్తి మరణించాడు. అ గ్రామానికి చెందిన పెద్దన్న పై బుధవారం వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు రక్షించి చికిత్స కోసం తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, గాయాల తీవ్రతకు తట్టుకోలేక మృతి చెందినట్లు సమాచారం. అతని వయస్సు 65నుండి 70సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.


ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయివీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని, చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వీధి కుక్కల నియంత్రణకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్