బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన పవన్‌కళ్యాణ్‌

1 గంట క్రితం

Pawan Kalyan discharged from the hospital

Pawan Kalyan discharged from the hospital

వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 09:55 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుండి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. గత కొంతకాలంగా భుజాల నొప్పితో బాధపడుతున్న ఆయన, తన రెండు భుజాలకు శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం ఈనెల 10వ తేదీన ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు 4 రోజుల పాటు చికిత్స పొందిన ఆయన, బుధవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని, వైద్యుల సూచన మేరకు మరికొంతకాలం పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్