బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆంధ్రప్రదేశ్‌లో కృత్రిమ పన్నీరు, చీజ్‌పై ఏడాది పాటు నిషేధం

1 గంట క్రితం

ap govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 05:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కృత్రిమ పన్నీరు, కృత్రిమ చీజ్‌ల తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలు, వినియోగంపై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. ప్రజారోగ్య పరిరక్షణ, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆహార భద్రతాశాఖ కమిషనర్ వీరపాండియన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో పన్నీరు పేరుతో కృత్రిమ పన్నీరు, చీజ్‌ను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిషేధ ఉత్తర్వులను అమల్లోకి తీసుకొచ్చింది. మార్కెట్లో విక్రయించే పన్నీరు, చీజ్ నాణ్యతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆహార భద్రతాశాఖ అధికారులు సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్