న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డిఎ) 3శాతం పెంచేందుకు కేంద్రం బుధవారం ఆమోదించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం కరువు భత్యం (డిఎ), కరువు భృతి (డిఆర్) 3శాతం పెంచాలని నిర్ణయించిందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బహుమతిగా ఈ పెంపును ప్రకటించారని అన్నారు. ఈ పెంపు ఈ ఏడాది జులై 1 నుండి అమల్లోకి వస్తుందని అన్నారు. దీంతో సుమారు 48.54 లక్షల మంది ఉద్యోగులు, 68.71 లక్షల మంది పెన్షన్‌దారులకు ప్రయోజనం చేకూరనుందని అన్నారు. ఈ పెంపుతో కేంద్రంపై రూ.10,016 కోట్ల మేర అదనపు భారం పడనుందని అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు 3శాతం డిఎ పెంపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 28, 2026, 05:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)