గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నవంబర్ 26 న పాలకొల్లు మున్సిపల్ ఎన్నికలు

2 గంటల క్రితం

west godavari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 03:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - పాలకొల్లు : పాలకొల్లు పురపాలక సంఘం ఎన్నికలు ఈనెల 26 న నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్‌ (ఈసి ) ప్రకటించింది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 23 మున్సిపాలిటీ లతో పాటు పాలకొల్లు మునిసిపల్‌ ఎన్నికలు కూడా జరగనున్నాయని తెలిపింది. ఈ నెల 13 న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 14 ,15, 16 తేదీల్లో నామినేషన్ దాఖలు, 17న నామినేషన్ ల పరిశీలన చేపట్టనున్నట్లు ఈసి తెలిపింది. 18 వరకు నామినేషన్ల ఉపసంహరణ కు గడువు ఉంటుందని వెల్లడించింది. నవంబర్ 26 న పోలింగ్‌ జరగనుందని ప్రకటించింది. పోలింగ్ సమయం ఉదయం 7.00 గం. నుంచి సాయంత్రం 5.00 గం. వరకు ఉంటుందని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్