ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రయాణికుల సంతృప్తే ప్రథమ ప్రాధాన్యత

4 రోజుల క్రితం

rtc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 10:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆర్‌టిసి జెఎమ్‌డి ఎం శివప్రసాద్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్‌టిసి ప్రయాణికుల సౌకర్యం, భద్రత, సంతృప్తికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఎపిఎస్‌ఆర్‌టిసి నూతన జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం శివప్రసాద్‌ ఆదేశించారు. ఆర్‌టిసి హౌస్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌, కమర్షియల్‌ విభాగాల పనితీరును బుధవారం సమీక్షించారు. అనంతరం విజయవాడ డిపో, సిటీ బస్టేషన్‌, పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌ను సందర్శించి క్షేత్రస్థాయిలో సేవలను పరిశీలించారు. విజయవాడ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లతో నేరుగా మాట్లాడారు. 24 గంటలూ విధుల్లో ఉంటూ పండగలు, ప్రత్యేక సందర్భాల్లోనూ ప్రయాణికులకు సేవలందిస్తున్న సిబ్బందిని అభినందించారు. ప్రభుత్వ సహకారంతో అందరూ బృందంగా పనిచేసి ఆర్‌‌టిసిని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్