ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద పెన్షనర్ల నిరసన

4 రోజుల క్రితం

bsnl
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 10:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌ : విజయవాడ చుట్టుగుంట సెంటర్‌లోని బిఎస్‌ఎన్‌ఎల్‌ ‌కార్యాలయం వద్ద బుధవారం ఫోరమ్ ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌‌సిపిఎ) ఆధ్వర్యాన ‘కాల్‌ అటెన్షన్‌ ‌డే’ (దృష్టి సారించే దినం) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న కార్మిక, ఉద్యోగ, పెన్షనర్ల వ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాటాలను కొనసాగించాలని కోరారు. దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బిఎస్‌ఎన్‌ఎల్‌, బ్యాంకులు, స్వయం ప్రతిపత్తి సంస్థల వద్ద చేపట్టిన ధర్నాలు, ప్రదర్శనల్లో భాగంగా ఎపి సర్కిల్‌ ‌బిఎస్‌ఎన్‌ఎల్‌ ‌కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సెప్టెంబర్‌ 17 ‌నుంచి 19 వరకు అన్ని రాష్ర్టాల రాజధానుల్లో జరిగే ధర్నాలను, నవంబర్‌ 25న జరిగే పార్లమెంట్‌ ‌మార్చ్‌, ఢిల్లీలోని జంతర్‌‌మంతర్‌ ‌వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెన్షన్ నిబంధనల ధృవీకరణ చట్టం-2025ను రద్దు చేయాలని, 2026కు ముందు ఉద్యోగ విరమణ చేసిన వారి పెన్షన్ సవరణను నిర్ధారించేలా 8వ కేంద్ర వేతన సంఘం ప్రతికూల విధివిధానాలను సవరించాలని, మధ్యంతర ఉపశమనం మంజూరు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. 2017 జనవరి ఒకటి నుంచి అమలులోకి వచ్చేలా బిఎస్‌ఎన్‌ఎల్‌‌-ఎంటిఎన్‌ఎల్‌ పెన్షనర్లకు, అప్పటి నుండి విలీనమైన పెన్షనర్లకు పెన్షన్ సవరించాలని, సవరించన 50 శాతం డిఎ-డిఆర్‌‌ను వేతనం లేదా పెన్షన్‌‌తో విలీనం చేయాలని, బ్యాంక్ పెన్షనర్ల పెన్షన్ అప్‌డేట్‌ ‌చేయాలని, స్వయం ప్రతిపత్తి సంస్థలకు 8వ సిపిసి ప్రయోజనాలు, సిజిహెచ్‌ఎస్‌ ‌సౌకర్యాన్ని వర్తింపజేయాలని, పదేళ్ల ఎనిమిది నెలల తర్వాత కమ్యుటేషన్ పునరుద్ధరించాలని, సిజిహెచ్‌ఎస్‌, ఆరోగ్య సంబంధిత సమస్యలను పరిష్కరించాలని, పెన్షన్లలో సమానత్వం ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐబిడిపిఎ ఉపాధ్యక్షులు పి.అశోక్ బాబు, ఎఫ్‌‌సిపిఎ కన్వీనర్‌ ఎన్ రామారావు, ఉపాధ్యక్షులు ఎ.కోటేశ్వరరావు, ఎన్‌‌సిపిపిఎ సర్కిల్‌ ‌కార్యదర్శి కె.ఎస్‌.సి.బోస్‌, ఎఫ్‌‌సిపిఎ కో కన్వీనర్‌ ఎ.చంద్రశేఖర రావు, ఎన్‌‌సిసిపిఎ ఉపాధ్యక్షులు సిహెచ్.నరసింహమూర్తి, ఎజిఎస్‌ఎస్‌ఎన్‌‌పిబడ్ల్యుఎ నాయకులు వి.కె.ప్రసాదరెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్