ఏడుగురికి గాయాలు..
మహిళ పరిస్థితి విషమం
ప్రజాశక్తి – చంద్రగిరి : చంద్రగిరి మండలం ఆగరాల సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి ఒడిశాకు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే చంద్రగిరి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







కామెంట్‌లు (0)