వాహనానికి నిప్పు పెట్టారా.. ప్రమాదవశాత్తూ కాలిపోయిందా?
ప్రజాశక్తి – వీరఘట్టం : పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం నీలానగరంలో ఎన్నికల ప్రచార రథం దగ్ధమైన ఘటన కలకలం రేపింది. నీలానగరానికి చెందిన పాలవలస లీలాప్రసాద్‌కు చెందిన ప్రచార వాహనం శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో మంటల్లో కాలిపోయింది. వాహనం మంటల్లో చిక్కుకున్న సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే వాహనం ప్రమాదవశాత్తూ కాలిపోయిందా? లేక గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా? అనే విషయం తెలియాల్సి ఉంది.
కాగా, నీలానగరానికి చెందిన కూటమి ఎంపీటీసీ అభ్యర్థి పాలవలస తేజేశ్వరి ఎన్నికల ప్రచారానికి ఈ వాహనాన్ని ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఓటమి భయంతోనే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని కూటమి అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)