శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిదిలింపులే...

1 గంట క్రితం

cf52e053-f793-4cd9-8d0e-957dc366e103.png
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 06:43 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • విపత్తు పరిహారంలో రాష్ట్రానికి కేంద్రం ద్రోహం

  • పుష్కర కాలంలో ఇదే తంతు

  • ఢిల్లీ ఫోన్లు, పరామర్శలకే పొంగిపోతోన్న ప్రభుత్వాలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : తరుచు తుపాన్లు, వరదలు, కరువుల వంటి ప్రకృతి వైపరీత్యాల బారిన పడి అపార నష్టాలకు గురవుతున్న ఆంధ్రప్రదేశ్‌‌కు విపత్తు సహాయం అందించే విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ద్రోహం చేసింది. ఈ పుష్కర కాలంలో బిజెపికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిస్తూ వచ్చిన టిడిపి, వైసిపి, టిడిపి కూటమి ప్రభుత్వాలే ఎపిలో అధికారంలో ఉన్నాయి. అయినా ప్రజలకు, రైతులకు, మౌలిక వసతులకు జరిగిన నష్టాలను పూడ్చేవిధంగా ప్రత్యేకంగా కేంద్రం నుంచి విపత్తు సహాయం సాధించడంలో ఘోరంగా వైఫల్యం చెందాయి. కేంద్రానికి నష్టాలపై నివేదికలు పంపడమే గొప్పగా చెప్పుకుంటున్నాయి. ప్రధాని, హోం మంత్రి తదితరుల ఫోన్‌ ‌పరామర్శలు, కేంద్ర బృందాల పర్యటనలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి. అడిగిన నిధులపై కేంద్రం మీనమేషాలు లెక్కించి ఎప్పటికో విదిలించడం, ఎగవేయడం, లేదంటే పలు దశల్లో కోతలు పెట్టి పరిహాసమాడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌‌నినో ప్రభావిత కరువు, వాయుగుండం, అర్నబ్‌, మురసు తుపాన్ల విషయంలో కేంద్రం నుంచి ఇబ్బడిముబ్బడిగా సహాయం వస్తుందంటున్న టిడిపి కూటమి ప్రభుత్వ ప్రకటనలు ప్రచారానికి, బాధితుల కంటి తుడుపుకేనని గత అనుభవాలను చూస్తే అర్థమవుతుంది.

ఎస్‌‌డిఆర్‌ఎఫ్‌ ‌కోతలు

విపత్తుల సహాయం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి స్టేట్‌ ‌డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ‌ఫండ్‌ (ఎస్‌‌డిఆర్‌ఎఫ్‌) ‌కాగా, రెండవది నేషనల్‌ ‌డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ (ఎన్‌‌డిఆర్‌‌ఎఫ్‌). ఎస్‌‌డిఆర్‌ఎఫ్‌.. ‌తక్షణ, పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకు రావడానికి, ముందస్తు అప్రమత్త చర్యలు తీసుకోడానికి సంబంధించింది. ఏ రాష్ట్రానికి ఏ ఏడాది ఎన్ని నిధులివ్వాలో ఆర్థిక సంఘం ఐదేళ్ల టర్మ్‌‌కు ముందే నిర్ణయిస్తుంది. నిర్ధారించిన ఫండ్‌‌లో కేంద్రం 75 శాతం, రాష్ట్రం 25 శాతం భరించాలి. ఎన్‌‌డిఆర్‌ఎఫ్‌ అనేది కేంద్రం ప్రత్యేకంగా విపత్తు తీవ్రతననుసరించి అదనపు సాయంగా ఇచ్చేది. ఎన్‌‌డిఆర్‌ఎఫ్‌ ప్రక్రియ మూడు దశలుగా ఉంటుంది. విపత్తు సంభవించాక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నష్టం నివేదికలు అందిన వెంటనే ‌వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల అధికారులతో బృందాలను నియమిస్తుంది. ఆ బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించి సహాయాన్ని సిఫారసు చేస్తాయి. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఇతర మంత్రిత్వశాఖల అధికారులతో కూడిన జాతీయ కార్యనిర్వాహక సబ్‌ ‌కమిటీ (ఎస్‌‌సి-ఎన్‌ఇసి) కేంద్ర బృందాల నివేదికలు పరిశీలించి సహాయం ఎంత ఇవ్వాలో సిఫారసు చేస్తుంది. ఈ సిఫారసులను హోం మంత్రి, ఆర్థిక మంత్రి, వ్యవసాయ మంత్రి, నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు సభ్యులుగా ఉండే హై-లెవల్‌ ‌కమిటీ (హెచ్‌ఎల్‌‌సి) పరిశీలించి సహాయాన్ని ‌

నిర్ధారిస్తూ ఆమోదిస్తుంది. హెచ్‌-ఎల్‌‌సి ఆమోదించినప్పటికీ విడుదల దగ్గరకొచ్చేసరికి పూర్తిగా ఎగ్గొట్టడమో లేదంటే కోతలు విధించడమో జరిగిన సందర్భాలున్నాయి.

పిసరంత సాయం

హదూద్‌ ‌ప్రచండ తుపాన్‌ ‌విషయంలో ఎన్‌‌డిఆర్‌ఎఫ్‌ ‌ఘోరంగా ఉంది. అప్పుడు ఎన్‌‌డిఎ ప్రభుత్వంలో టిడిపి భాగస్వామిగా ఉంది. ప్రధాని మోడీ ఏరియల్‌ ‌సర్వే నిర్వహించి తక్షణ సహాయంగా రూ.వెయ్యి కోట్లు ప్రకటించారు. చివరాఖరుకి హెచ్‌ఎల్‌‌సి రూ.737.60 కోట్ల సహాయానికి ఆమోదించగా, ఇచ్చింది 400 కోట్లు. హుదూద్‌ బీభత్సానికి విశాఖ నగరం, ఉత్తరాంధ్రకు రూ.వేల కోట్ల నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.4,861 కోట్ల సాయం అభ్యర్థించినా కేంద్రం కనికరించలేదు. 2016-17 తీవ్ర కరువు సహాయం కింద ఎపి ప్రభుత్వం 2,513 కోట్లు అడిగితే ఇచ్చింది 518 కోట్లు. వైసిపి హయాంలో 2022, 2023 సంవత్సరాల్లో నెలకొన్న భారీ వర్షాలు, వరదలకు కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదు. టిడిపి కూటమి సర్కారు వచ్చాక 2024లో బుడమేరు వరదలకు ఎన్‌‌డిఆర్‌ఎఫ్‌ ‌అస్సలు రాలేదు. ఈ ఏడాది ఖరీఫ్‌‌లో కరువు, వాయుగుండం, రెండు తుపాన్లు ప్రజలను నష్టపరిచాయి. కేంద్రం ఏ మేరకు నిధులిస్తుందో అనుమానమే.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్