బుధవారం, 12 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅధికారులను అడ్డుకున్న ‘వెలిగొండ’ నిర్వాసితులు

1 గంట క్రితం

VELIGONDA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 12:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- పెద్దారవీడు (మార్కాపురం జిల్లా) : తమ సమస్యలను గాలికి వదిలేసి తమను గ్రామం నుంచి వెళ్లిపోమంటే ఎలా? అంటూ అధికారులను మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామ రైతులు బుధవారం అడ్డుకున్నారు. నిర్వాసితులందరికీ న్యాయం చేసే వరకూ ఊళ్లను ఖాళీ చేసేది లేదని, ఊరిలోకి అధికారులనూ రానివ్వబోమని తెగేసి చెప్పారు. పెద్దారవీడు మండలంలోని సుంకేసుల గ్రామం వెలిగొండ ప్రాజెక్టు ముంపులో ఉంది. గ్రామాన్ని వారం రోజుల్లో ఖాళీ చేయాలని చెప్పేందుకు వెలిగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ పద్మావతి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ సువార్త, ఇతర రెవెన్యూ అధికారులు గ్రామానికి వస్తున్నట్లు సుంకేసుల గ్రామస్తుల కు సమాచారం అందింది. దీంతో, వారు గ్రామ పొలిమేరకు చేరుకొని అధికారుల వాహనాలను అడ్డుకున్నారు. పూర్తి స్థాయిలో న్యాయం చేయకుండా తమను గ్రామం నుండి ఎలా ఖాళీ చేయిస్తారని అధికారులను నిలదీశారు. తమ గడ్డపై కారు దిగితే సహించబోమని తెల్చి చెప్పారు. తమ సమస్యలు పరిష్కరిస్తేనే గ్రామంలో అడుగు పెట్టాలని, లేదంటే వెనక్కి పోవాల్సిందేనని డిమాండ్‌ ‌చేశారు. దీంతో, నిర్వాసితుల ఆగ్రహానికి భయపడి అధికారులు అక్కడి నుంచి వెనుదిగారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్