అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల జోరు మొదలైంది. పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని పలు ప్రాంతాలకు హెచ్చరికలు చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా బలపడి వాయుగుండంగా మారడంతో పాటు నైరుతి రుతుపవనాలు దేశంలో చాలా చురుగ్గా కదులుతున్నాయి. ఈ డబుల్ ఇంపాక్ట్ వల్ల రాబోయే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారింది. వాతావరణమంతా చల్లబడింది. పలు ప్రాంతాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారికంగా ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో వానలు ...
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 07, 2026, 10:29 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)