ప్రజాశక్తి-విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను రీషెడ్యూల్ చేశారు. అక్టోబర్ 28న జరగాల్సిన ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నవంబర్ 1వ తేదీకి రీషెడ్యూల్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 99 పట్టణ, నగర స్థానిక సంస్థలకు నవంబర్ 1న పోలింగ్ నిర్వహించనుండగా, నవంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను నాలుగు రోజులు వాయిదా వేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నెల 25న తుది జాబితాను ప్రకటించనున్నారు. మరోవైపు మైదుకూరు మున్సిపాలిటీకి సంబంధించి పోలింగ్ తేదీని ఇంకా ఖరారు చేయలేదు. అక్కడ నిబంధనల ప్రకారం తిరిగి నామినేషన్ల ప్రక్రియ నిర్వహించిన అనంతరం పోలింగ్ తేదీని ప్రకటించనున్నారు.
ఏపీ మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్
23 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 22, 2026, 08:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)