జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’. పూర్వాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ పతాకాలపై పూర్వాజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఈ నెల 30న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు హరీశ్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్వాజ్ మాట్లాడుతూ.. సినిమాలోని ఇంటర్వెల్ బ్యాంగ్, ద్వితీయార్ధంలో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని అన్నారు. ఆ ట్విస్ట్‌ను ఇంటర్వెల్ తర్వాత ఐదు నిమిషాల్లోపు ఊహించి, చిత్రబృందం ప్రకటించే వాట్సాప్ నంబర్‌కు పంపిన వారికి సినిమా విజయోత్సవ కార్యక్రమం రోజున కోటి రూపాయల బహుమతి అందిస్తామని ప్రకటించారు. వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా సినిమా ఏడాది ఆలస్యమైనా, నాణ్యత విషయంలో రాజీ పడలేదని తెలిపారు. జ్యోతి పూర్వజ్ ఇందులో టెర్రరిస్ట్, గృహిణి, వ్యాంపైర్, స్పై, సూపర్ షీ వంటి విభిన్న పాత్రల్లో కనిపిస్తారని, తాను పోలీస్ అధికారి, శాస్త్రవేత్త పాత్రల్లో నటించానని చెప్పారు. ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
‘కిల్లర్’ ట్విస్ట్ చెబితే కోటి బహుమతి!
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 22, 2026, 07:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)