చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్న చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. ఈ సినిమా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించింది. సినిమా చూసిన ప్రేక్షకులు సంతోషంగా థియేటర్ల నుంచి బయటకు వస్తారని, ఈ కథ కొన్నేళ్లపాటు వారి హృదయాల్లో నిలిచిపోతుందని దర్శకుడు శ్రీకర్ అన్నారు. విడుదల తేదీ పలుమార్లు మారడంతో తన స్నేహితులు సినిమా విడుదలను నమ్మడం లేదని బాలనటుడు రోహన్ రాయ్ సరదాగా చెప్పారు. నవంబర్ 6న తప్పకుండా సినిమా విడుదలవుతుందని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. కంటెంట్‌పై నమ్మకంతోనే సరైన విడుదల తేదీ కోసం వేచి చూశామని నిర్మాత ధీరజ్ మొగిలినేని తెలిపారు. కుటుంబమంతా కలిసి చూసి ఆనందించే చిత్రమిదని అన్నారు. రోహన్ రాయ్, అరుణ్, ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్ధన్ తదితరులు ఇందులో నటించారు.
నవంబర్ 6న ‘సమ్మర్ హాలిడేస్’
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 22, 2026, 07:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)