బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 గూర్ఖా ఎడిషన్ విడుదల

1 గంట క్రితం

new_project
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 07:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : మిడ్‌-సైజ్ మోటార్‌సైకిల్ విభాగంలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్, ‘క్లాసిక్ 350 గూర్ఖా ఎడిషన్’ను విశాఖ మార్కెట్లో విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎంవిపి డబల్ రోడ్ షోరూమ్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ యాద్విందర్ సింగ్ గులేరియా, గూర్ఖా బ్రిగేడ్ ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ జనరల్ సంజీవ్ చౌహాన్ మాట్లాడుతూ, గూర్ఖా సైనికుల స్ఫూర్తి, సంప్రదాయాలను గౌరవించే ఈ ప్రత్యేక ఎడిషన్‌ తమకు గర్వకారణమన్నారు. ప్రత్యేకమైన ‘గూర్ఖా గ్రీన్’ రంగు, ‘క్రాస్డ్ ఖుక్రీల’ చిహ్నం ఈ మోటార్‌సైకిల్‌కు ప్రత్యేక గుర్తింపును అందిస్తున్నాయని తెలిపారు. క్లాసిక్ 350 గూర్ఖా ఎడిషన్ ధర రూ.2,10,684 (ఎక్స్‌-షోరూమ్,)గా నిర్ణయించారు. బుకింగ్‌లు నేటి నుండి ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్