బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నాలుగో రోజుకు చేరిన రైతుల నిరాహార దీక్షలు

1 గంట క్రితం

Farmers' hunger strikes enter the fourth day.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 05:16 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

.. గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించాలి

..నల్లమడ ప్రాంత రైతుల డిమాండ్

..గజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే వరకు పోరాటం కొనసాగుతుంది.

.. 24న పర్చూరులో చేపట్టే బందుకు సహకరించాలి.


ప్రజాశక్తి-పర్చూరు (బాపట్ల) : పర్చూరు ప్రాంతంలో గుంటూరు ఛానల్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ను వెంటనే విడుదల చేయాలని, పనులు ప్రారంభించాలని నల్లమడ రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నల్లమడ రైతు సంఘం నాయకులు, రైతులు మాట్లాడుతూ ... నల్లమడ ప్రాంత రైతులకు ప్రజలకు సాగునీరు,తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని కోరారు . అందుకు ప్రజాప్రతినిధులు అధికారులు తక్షణమే స్పందించాలని చెప్పారు . ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం ద్వారా నల్లమడ ప్రాంత రైతాంగానికి ఆరుతడులకు సాగునీరు అందుతుందని చెప్పారు. అలాగే సుమారు 40 గ్రామాలకు తాగునీరు అందుతుందని అన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నా గుంటూరు ఛానెల్ పర్చూరు వరకు పొడిగించాలని వారి కల సహకారం చేయాలని కోరారు. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి తప్ప ఎవరు సరిగ్గా పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ పూర్తి చేసేందుకు ఎందుకు ఆలస్యం అవుతుందో అర్థం కాకుండా ఉందని తెలిపారు. ప్రభుత్వం నుంచి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేవరకు ఈ నిరాహార దీక్షలు జరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. రిలే దీక్షలో పాల్గొన్న రైతులు ప్రజలు తాహసిల్దార్ కార్యాలయంవద్ద నినాదాలు చేశారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయ సిబ్బందికి సమర్పించారు. అలాగే ఈనెల 24వ తేదీన పర్చూరు పట్టణంలో బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ఈ రిలే దీక్షలో నల్లమడ రైతు సంఘం నాయకులు డాక్టర్ కోల్లా రాజ్ మోహన్ రావు , గడ్డిపాటి శ్రీనివాసరావు , అడుసు మల్లి గ్రామానికి చెందిన ఎం. జగన్నాథం, నాయుడు సుబ్బారావు, దోప్పలపూడి సుబ్బారావు, గొల్లపూడి శారద, కొత్తపల్లి ప్రసాదు, దోప్పలపూడి విజయమ్మ ,గన్నమనేని సామ్రాజ్యం,రావి మల్లేశ్వరి, దోప్పలపూడి నాగయ్య, పర్చూరు ప్రాంత రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్