ప్రజాశక్తి - ఆలమూరు : ఆలమూరు మండల కేంద్రంలోని ఓ బ్యాంకు శాఖలో రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న జి.సుప్రియ(28) సోమవారం అనుమానాస్పదరీతిలో అదృశ్యమైన విషయం తెలిసిందే. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఆమె స్కూటీ, కళ్లజోడు చొప్పెల్ల లాకుల వద్ద గుర్తించారు. ఏ కారణం చేతనైనా కాలువలో దూకేశారా..? ఎక్కడికైనా వెళ్లారా..? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ.. గజ ఈతగాళ్లతో చొప్పెల్ల లాకుల సమీపంలో గాలింపు చేపట్టారు. మూడు రోజులైన ఆమె జాడ తెలియక పోవడంతో పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహకారం తీసుకుని గాలింపును ముమ్మరం చేశారు. కాగా ఆమె కాలువలో దూకి ఉంటే ఇప్పటికే మృతదేహం తేలాల్సి ఉందని గజ ఈతగాళ్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె అదృశ్యం మిస్టరీగా మారింది.
బ్యాంక్ ఉద్యోగి అదృశ్యంపై వీడని ఉత్కంఠ..
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 19, 2026, 06:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)