ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: అమరావతి రాజధానిలో గవర్నర్ బంగళా నిర్మాణం కోసం రూ.212.22 కోట్లను విడుదల చేశారు. ఈమేరకు సోమవారం పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ సోమవారం జిఓ నెంబరు 1110 విడుదల చేశారు. ఈ బంగళాలో గవర్నర్ మాన్షన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, రెండు గెస్ట్ హౌస్‌లు, ఆరు ఆఫీసర్ క్వార్టర్లు, పది సీనియర్ స్టాఫ్ క్వార్టర్లు, 12 జూనియర్ స్టాఫ్ క్వార్టర్లు, 40 సపోర్టింగ్ స్టాఫ్ క్వార్టర్లు, 20 గదులతో కూడిన బ్యారక్స్, 144 బ్యారక్ వసతి, నాలుగు సెంట్రీ పోస్టులతో కూడిన ప్రహరీగోడ నిర్మించనున్నట్లు తెలిపారు. గత ఏడాది డిసెంబర్లో సిఆర్‌డిఏ కమిషనర్ నుండి అందిన లేఖ నెం. MAU61-USIOHB (OTH)/435/2025-HB/01 ప్రకారం ఈ ఉత్తర్వులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. మంజూరు చేసిన రూ.212.22 కోట్ల మొత్తానికి మించి రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి అదనపు ఆర్థిక భారం పడకూడదని తెలిపారు.
గవర్నర్ బంగళా కోసం రూ.212 కోట్లు విడుదల
55 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 31, 2026, 07:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)