శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సాయికృష్ణ మృతి పై అతడి తల్లి విజయలక్ష్మి సంచలన ఆరోపణలు

1 గంట క్రితం

సాయికృష్ణ మృతి పై అతడి తల్లి విజయలక్ష్మి సంచలన ఆరోపణలు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 05:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి పై అతడి తల్లి విజయలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. కాళ్లపై మేకులు కొట్టి తన కుమారుడిని సిఐ నాగరాజు దారుణంగా హింసించి చంపాడని ఆరోపించారు. సాయికృష్ణ మృతిపై మెజిస్టీరియల్‌ ఎదుట విజయలక్ష్మి వాదనలు ముగిశాయి. తన అభిప్రాయాలను ఆమె మెజిస్ట్రేట్‌ ఎదుట వినిపించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ .... 'నా కుమారుడి బూడిద ఇప్పించండి.. అంత్యక్రియలు చేసుకుంటా. లేదంటే ఆత్మహత్య చేసుకుంటా. ఈ కేసుతో సంబంధం ఉన్న కొందరిని అరెస్టు చేశారు. మిగతావారి సంగతి ఏంటి ? సబ్‌కలెక్టర్‌కు వివరాలన్నీ చెప్పా.. మళ్లీ పిలుస్తామని అన్నారు. పీఎస్‌ పైనున్న బూడిద, ఎముకలు నా కుమారుడివేనని ఏమిటి నమ్మకం ? ఇలాంటి హత్యలు ఎన్ని చేసి ఉంటారో ఎవరికి తెలుసు ’’ అని విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్