శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇంటి గోడ దూకిన చిరుత..

1 గంట క్రితం

tiger
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 06:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఇంట్లోకి చొరబడేందుకు యత్నం

- రేణిగుంటలో చిరుత కలకలం..

ప్రజాశక్తి - రేణిగుంట(తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని వెంకటాపురంలో చిరుతపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. అర్థరాత్రి సమయంలో ఓ ఇంట్లోకి చొరబడేందుకు చిరుతపులి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. స్థానిక లెక్చరర్ బాలాజీ నివాసంలోకి ప్రవేశించేందుకు చిరుతపులి యత్నించింది. అయితే కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన సిసి ఫుటేజ్ వైరల్ అవుతుంది. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గత మూడు రోజులుగా వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. చిరుత కదలికలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదవడంతో ప్రజలు మరింత అప్రమత్తమయ్యారు. చిరుతను వెంటనే బంధించి ప్రజలకు భద్రత కల్పించాలని అటవీశాఖ అధికారులను స్థానికులు కోరుతున్నారు. రాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని స్థానికులు ఒకరినొకరు హెచ్చరిస్తున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్