శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మమతా బెనర్జీకి మరో షాక్.. ఆ పార్టీ అధ్యక్షురాలు రాజీనామా

1 గంట క్రితం

TMC
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 06:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కోల్‌‌కతా : మమతా బెనర్జీకి వరుసగా షాక్‌‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం టిఎంసికి చెందిన ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తాజాగా అదేబాటలో ఆ పార్టీ అధ్యక్షురాలు చంద్రిమ భట్టాచార్య కూడా శనివారం రాజీనామా చేశారు. ఆ పార్టీకి చెందిన అన్ని పదవులకూ ఆమె రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. అలాగే టిఎంసికి చెందిన వివిధ బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన బాద్యతల నుంచి కూడా ఆమె తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకపై పార్టీకి సంబంధించిన అంశాల్లో తన పేరును ప్రస్తావించకూడదని, మమత తరఫున తనను సంప్రదించకూడదని కూడా చంద్రిమ ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే మమతకి ఎంతో సన్నిహితంగా ఉండే ఈమె తన రాజీనామాకు గల కారణమేంటో వెల్లడించకపోవడం గమనార్హం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్